ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'మహిళల భద్రత.. సంరక్షణ కార్యదర్శుల బాధ్యత'

గ్రామ, వార్డు సచివాలయాల్లో కొత్తగా నియమించిన మహిళా సంరక్షణ కార్యదర్శులకు రెండు వారాల పాటు శిక్షణ ఇవ్వనున్నట్లు డీజీపీ గౌతమ్​ సవాంగ్ తెలిపారు. విజయవాడలో నిర్వహించిన శిక్షకుల కార్యశాలలో ఆయన పాల్గొన్నారు. మహిళలు, బాలికల భద్రతే బాధ్యతగా కార్యదర్శులు పనిచేయాలని డీజీపీ సూచించారు.

Dgp goutam sawang
మీడియాతో మాట్లాడుతున్న డీజీపీ గౌతమ్ సవాంగ్

By

Published : Dec 2, 2019, 9:05 PM IST

మీడియాతో మాట్లాడుతున్న డీజీపీ గౌతమ్ సవాంగ్

రాష్ట్రంలోని 14 వేల 967 గ్రామ, వార్డు మహిళా సంరక్షణ కార్యదర్శులకు శిక్షణా తరగతులు త్వరలో ప్రారంభకానున్నాయి. విజయవాడ డీజీపీ కార్యాలయంలో నిర్వహించిన శిక్షకుల కార్యశాలలో డీజీపీ గౌతమ్ సవాంగ్, పోలీసులు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. పోలీసు చట్టాలు వాటిపై అవగాహన కల్పించటమే శిక్షణా తరగతుల ముఖ్య ఉద్దేశమని డీజీపీ తెలిపారు. సంరక్షణ కార్యదర్శులకు శిక్షణ ఇచ్చేందుకు 66 మందికి శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు. గ్రామ సచివాలయాలలోనే గ్రామ, వార్డు మహిళా సంరక్షణ కార్యదర్శులు విధులు నిర్వహిస్తారని.. మహిళలు, బాలికల సమస్యలు పరిష్కరించే బాధ్యత వీరిపై ఉందని డీజీపీ స్పష్టం చేశారు.

మహిళల సమస్యలు పరిష్కారమే లక్ష్యం

14 వేల 967 కార్యదర్శులకు వచ్చే 6 నెలల్లో 10 బృందాలుగా 11 కేంద్రాల్లో శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. పోలీసులతో పాటు, మహిళా - శిశు సంక్షేమ శాఖ అధికారులు శిక్షణా తరగతుల్లో పాల్గొంటారని డీజీపీ అన్నారు. మహిళా సంరక్షణ కార్యదర్శులు గ్రామాల్లో మహిళల భద్రతను బాధ్యతగా తీసుకుని సమస్యలను పరిష్కరించాలన్నారు.

ఆత్మరక్షణ, యోగా శిక్షణ
మహిళా సంరక్షణ కార్యదర్శుల వల్ల సమాజంలో పెనుమార్పురావాలని గౌతమ్​ సవాంగ్ పిలుపునిచ్చారు. రెండు వారాలు ప్రయోగాత్మకంగా శిక్షణ ఇవ్వనున్నట్లు డీజీపీ తెలిపారు. మహిళా కార్యదర్శులకు ఆత్మరక్షణ, యోగా విభాగాల్లో శిక్షణ ఇస్తున్నామని డీజీపీ గౌతమ్​ సవాంగ్ వెల్లడించారు.

ఇదీ చదవండి :

'సచివాలయాల్లోనే మహిళా సంరక్షణ కార్యదర్శుల విధులు'

ABOUT THE AUTHOR

...view details