తెలుగుదేశం అధినేత, మాజీ సీఎం చంద్రబాబు భద్రతలో ఎలాంటి మార్పులు, చేర్పులు లేవని డీజీపీ కార్యాలయం ప్రకటించింది. దేశంలోనే అత్యంత హై - సెక్యూరిటీని చంద్రబాబుకు కల్పిస్తున్నట్లు పేర్కొంది. ప్రస్తుతం జడ్ ప్లస్ సెక్యూరిటిలో చంద్రబాబు ఉన్నారని వివరించింది. సెక్యూరిటీ రివ్యూ కమిటీ నిర్ణయం మేరకు భద్రతలో మార్పులు, చేర్పులు చేసినట్లు తెలిపింది. మొత్తం 183 మందితో భద్రత కల్పిస్తున్నామని.. విజయవాడలో 135 మంది, హైదరాబాద్‌లో 48 మంది సిబ్బంది ఉన్నారని పేర్కొంది.
చంద్రబాబు భద్రతలో మార్పుల్లేవు: డీజీపీ కార్యాలయం - Chandrababu Security news
తెదేపా అధినేత చంద్రబాబుకు కల్పిస్తున్న భద్రతపై డీజీపీ కార్యాలయం వివరాలు వెల్లడించింది. ఆయన భద్రతలో ఎలాంటి మార్పులు చేయలేదని తెలిపింది. దేశంలోనే అత్యంత హై సెక్యూరిటీని చంద్రబాబుకు కల్పిస్తున్నట్లు పేర్కొంది.
DGP Office Statement on Chandrababu Security
TAGGED:
Chandrababu Security news