ఈరోజు నుంచి ద్విచక్రవాహనంపై ఒకరికి, ఫోర్ వీలర్‌పై ఇద్దరికి మాత్రమే అనుమతి ఉన్నట్లు తెలంగాణ రాష్ట్ర డీజీపీ మహేందర్‌రెడ్డి తెలిపారు. నిబంధనలు అతిక్రమిస్తే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని పేర్కొన్నారు. ఆటో సంఘాలకు ఇప్పటికే ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. లాక్ డౌన్ అమలు కోసం రాష్ట్రవ్యాప్తంగా చెక్‌పోస్టులు ఏర్పాటు చేశామన్నారు. ఇవాళ మధ్యాహ్నం నుంచి కఠినంగా లాక్‌డౌన్ అమలు చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. నిబంధనలకు విరుద్ధంగా ఎవరైనా వ్యవహరిస్తే కఠిన చర్యలు తీసుకోవాలని డీజీపీ మహేందర్‌రెడ్డి వెల్లడించారు.
బైకు మీద ఒకరు.. ఫోర్ వీలర్లో ఇద్దరే: తెలంగాణ డీజీపీ - ఈరోజు నుంచి ద్విచక్రవాహనంపై ఒకరు, ఫోర్ వీలర్‌పై ఇద్దరికి మాత్రమే అనుమతి
ఈరోజు నుంచి ద్విచక్రవాహనంపై ఒకరు, ఫోర్ వీలర్‌పై ఇద్దరికి మాత్రమే అనుమతి ఉన్నట్లు తెలంగాణ రాష్ట్ర డీజీపీ మహేందర్‌రెడ్డి వెల్లడించారు. ఎవరైనా నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
dgp-mahender