TS DGP on New Year Celebrations: నూతన సంవత్సర వేడుకలకు సంబంధించిన ఆంక్షలు కఠినంగా అమలు చేయనున్నట్టు తెలంగాణ రాష్ట్ర పోలీస్ బాస్ స్పష్టం చేశారు. ఒమిక్రాన్ కట్టడిలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా ఆంక్షలు అమల్లో ఉంటాయని డీజీపీ మహేందర్రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో జనవరి 2 వరకు ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయని డీజీపీ తెలిపారు. ప్రతిఒక్కరు కొవిడ్ నిబంధనలు పాటించే విధంగా ఆదేశాలు అమలు చేయాలని పోలీసులకు అదేశాలిచ్చామన్నారు.
కొవిడ్ నిబంధనలు అమలు చేయాలని ఆదేశాలు ఇచ్చినట్టు డీజీపీ తెలిపారు. పబ్‌లు, ఈవెంట్లలో ప్రభుత్వ ఆదేశాలు పాటించాలని.. నూతన సంవత్సర వేడుకలు ప్రశాంతంగా జరిగేలా సహకరించాలని రాష్ట్ర ప్రజలను కోరారు. ర్యాలీలు, బహిరంగ సభలపై నిషేధం ఉందన్నారు. అందుకు అణుగుణంగా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నామన్నారు. బహిరంగ ప్రదేశాల్లో కొవిడ్ నిబంధనలు పాటించాలని డీజీపీ సూచించారు.