పంచాయతీ ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించినందుకు.. ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ అభినందించారని డీజీపీ గౌతమ్ సవాంగ్ తెలిపారు. మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు సిద్ధంగా ఉన్నామనీ.. ఈ మేరకు ఆయా జిల్లాల అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు వెల్లడించారు. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నిర్వహణకు సైతం సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు. పోలీసులకు కరోనా సోకినట్టు ఎటువంటి నివేదికలు లేవనీ... అవసరమైతే పోలీసు సిబ్బందికి వాక్సిన్ వేయిస్తామని డీజీపీ స్పష్టం చేశారు.
పంచాయతీ ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించాం: డీజీపీ - పంచాయతీ ఎన్నికలపై డీజీపీ గౌతమ్ సవాంగ్ వార్తలు
పంచాయతీ ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించామని.. డీజీపీ గౌతమ్ సవాంగ్ తెలిపారు. పంచాయతీ ఎన్నికల నిర్వహణపై ఎస్ఈసీ అభినందించారని అన్నారు.
డీజీపీ గౌతమ్ సవాంగ్