ప్రతి పోలీసు అధికారి జవాబుదారీతనం కలిగి ఉండాలని.. .సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని రాష్ట్ర డీజీపీ గౌతం సవాంగ్ అన్నారు. సమస్యల పరిష్కారం కోసం వచ్చే ఫిర్యాదుదారులను ఎలా రిసీవ్ చేసుకోవాలనే అంశంపై.. గుంటూరు జిల్లా పోలీసులకు రెండు రోజులు పాటు శిక్షణ తరగతులు నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన... పోలీసు వ్యవస్థలో సమూలమైన మార్పులు తీసుకురావడానికి కృషి చేస్తున్నామని చెప్పారు. సీఎం జగన్ ఆదేశాల మేరకు అవినీతికి పాల్పడే వారిపై ఉక్కుపాదం మోపుతున్నామన్నారు. సమస్యలతో వచ్చే బాధితులకు భరోసా ఇవ్వాలని సిబ్బందికి సూచించారు.
బాధితులకు భరోసా ఇచ్చేలా చూడండి: డీజీపీ సవాంగ్ - డీజీపీ సవాంగ్
సమస్యలతో పోలీసు స్టేషన్కు వచ్చే బాధితులకు భరోసా ఇవ్వాలని రాష్ట్ర డీజీపీ గౌతం సవాంగ్ సిబ్బందికి సూచించారు. ప్రతి ఒక్కరూ జవాబుదారీతనంతో వ్యవహారించాలని అన్నారు.
![బాధితులకు భరోసా ఇచ్చేలా చూడండి: డీజీపీ సవాంగ్ dgp gowtham sawang](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8418416-66-8418416-1597403827281.jpg)
dgp gowtham sawang