విశాఖ విమానాశ్రయంలో చంద్రబాబును వైకాపా కార్యకర్తలు అడ్డుకున్న ఘటనపై డీజీపీ గౌతమ్ సవాంగ్ హైకోర్టుకు హాజరయ్యారు. మాజీ ఎమ్మెల్యే శ్రావణ్‌కుమార్ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ సందర్భంగా వివరణ ఇవ్వాలన్న హైకోర్టు ఆదేశాల మేరకు ఆయన న్యాయస్థానానికి తరలివచ్చారు. విశాఖ విమానాశ్రయంలో పోలీసుల తీరును తప్పుబడుతూ పిటిషన్ వేసిన శ్రావణ్‌కుమార్... వైకాపా కార్యకర్తలను నిలువరించడంలో పోలీసులు విఫలమయ్యారని ఆరోపించారు. సీఆర్‌పీసీ 151 కింద చంద్రబాబుకు జారీ చేసిన నోటీసుపై డీజీపీ వివరణ ఇవ్వనున్నారు.
హైకోర్టుకు హాజరైన డీజీపీ గౌతమ్ సవాంగ్ - హైకోర్టుకు డీజీపీ
డీజీపీ గౌతమ్ సవాంగ్ హైకోర్టుకు హాజరయ్యారు. విశాఖపట్నం విమానాశ్రయంలో చంద్రబాబును అడ్డుకున్న ఘటనపై ఈరోజు హైకోర్టులో విచారణ జరిగింది. సీఆర్‌పీసీ 151 అమలుపై డీజీపీ వివరణ ఇవ్వనున్నారు.
dgp gowtham sawang in high court