ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా దేవాలయాలపై దాడులకు సంబంధించి 19 కేసులు నమోదు చేశామని డీజీపీ గౌతమ్ సవాంగ్ తెలిపారు. స్వల్ప సమయంలోనే 12 కేసులను ఛేదించి నిందితులను అరెస్టు చేశామని వెల్లడించారు. ఏడు కేసులు దర్యాప్తులో ఉన్నాయన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 47 వేల 359 దేవాలయాలను గుర్తించి వాటికి మ్యాపింగ్ పూర్తి చేశామని వివరించారు. ప్రతి ఒక్క దేవాలయానికి పూర్తి స్థాయిలో భద్రత ప్రమాణాలు తీసుకోవాలని.. సంబంధిత వ్యక్తులకు నోటీసులు జారీ చేశామని చెప్పారు. గడిచిన రెండు వారాలలో 886 దేవాలయాల వద్ద పోలీసులు సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేశారని వెల్లడించారు.
దేవాలయాలపై దాడులు..19 కేసులు నమోదు: డీజీపీ - ఏపీలో దేవాలయాలపై దాడులు
రాష్ట్రవ్యాప్తంగా దేవాలయాలపై దాడులకు సంబంధించి పోలీసులు 19 కేసులు నమోదు చేశారు. 12 కేసుల్లో నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు డీజీపీ గౌతమ్ సవాంగ్ వెల్లడించారు. గడిచిన రెండు వారాల్లో 886 దేవాలయాల వద్ద పోలీసులు సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
dgp gowtham