ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

మహిళా పోలీసులకు పురస్కారాల ప్రదానం - dgp gowtham swang news

విధుల్లో ఉత్తమ ప్రతిభ కనబర్చిన మహిళా సిబ్బందికి... డీజీపీ గౌతం సవాంగ్ అవార్డులు అందజేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించిన దిశ వాహనాలను జీపీఎస్​తో అనుసంధానం చేసినట్లు తెలిపారు.

dgp
మహిళా పోలీసులకు అవార్డులు అందజేత

By

Published : Mar 9, 2021, 9:44 AM IST

మహిళా దినోత్సవం సందర్భంగా రాష్ట్రంలోని.. 18 యూనిట్​లలో విధుల్లో ఉత్తమ ప్రతిభ కనబర్చిన మహిళా పోలీసు సిబ్బందికి డీజీపీ గౌతం సవాంగ్ అవార్డులు అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మహిళల రక్షణ కోసం దిశ పోలీస్ స్టేషన్లు ప్రారంభించినట్లు వివరించారు.

13 జిల్లాల్లో ప్రత్యేకంగా 18 దిశ పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేసి.. ప్రతి జిల్లాలో ప్రత్యేకంగా పబ్లిక్ ప్రాసిక్యూటర్లను పెట్టినట్లు వెల్లడించారు. కేసులను దర్యాప్తు చేయడానికి దిశ దర్యాప్తు వాహనాలను ప్రారంభించినట్లు తెలిపారు. ఈ వాహనాలను అన్ని దిశ పోలీసు స్టేషన్లకు ఇచ్చినట్లు చెప్పారు. 900 దిశ పెట్రోలింగ్ స్కూటీలు రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభించినట్లు వివరించారు. వీటన్నింటిని జీపీఎస్, దిశ యాప్‌ రెస్పాన్స్ ‌సిస్టమ్‌తో అనుసంధానం చేస్తున్నట్లు వెల్లడించారు.

ABOUT THE AUTHOR

...view details