వివిధ మాధ్యమాల్లో ప్రచురణలు, ప్రసారాలపై, పోస్టులపై డీజీపీ సవాంగ్ కీలక ప్రకటన చేశారు. అభిప్రాయాలు చెప్పేవాళ్లు నియంత్రణ పాటించకుంటే చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. స్వీయ నియంత్రణం లేకపోవడంతో కొన్నిసార్లు వ్యాఖ్యలు, దూషణల నుంచి వైషమ్యాల వైపు దారితీస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ పరిణామాలు సమాజానికి, వ్యవస్థకు మంచిది కాదని అభిప్రాయపడ్డారు. ఈ తరహా పోకడలను అరికట్టేందుకు ప్రత్యేక విభాగం ఏర్పాటు చేశామని డీజీపీ సవాంగ్ వెల్లడించారు.
'రాజ్యాంగ సంస్థలు, వ్యక్తులపై వ్యాఖ్యలను ఉపేక్షించబోం. అభిప్రాయ వ్యక్తీకరణలో చట్టాలను అనుసరించాలి. అశ్లీల, అసభ్యకర, నిందాపూర్వక వ్యాఖ్యానాలు తగవు. బాధ్యులపై నిష్పక్షపాతంగా ముందుకెళ్తాం. హైకోర్టు ఇచ్చిన ఫిర్యాదుపై దర్యాప్తు వేగవంతం చేశాం. హైకోర్టు తీర్పుల పట్ల కొందరు వ్యాఖ్యలు చేయడంపై ఫిర్యాదు అందింది. ప్రభుత్వ పెద్దలపై తప్పుడు ప్రచారాలు, అవాస్తవాలు ప్రచారంపైనా కూడా దృష్టి పెట్టాం' - డీజీపీ, గౌతం సవాంగ్