ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

NATIONAL AWARDS: రాష్ట్ర పోలీసు శాఖకు 4 జాతీయస్థాయి అవార్డులు

ఏపీ పోలీసులకు జాతీయస్థాయిలో నాలుగు అవార్డులు దక్కాయని డీజీపీ గౌతమ్ సవాంగ్ వెల్లడించారు. ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌తోపాటు వివిధ విభాగాల్లో అవార్డులు వచ్చాయన్నారు. పోలీసు శాఖకు 2019 డిసెంబర్ నుంచి 130 అవార్డులు వచ్చాయని హర్షం వ్యక్తం చేశారు.

dgp on police awards
dgp on police awards

By

Published : Sep 3, 2021, 7:10 PM IST

డీజీపీ గౌతమ్ సవాంగ్

ఏపీ పోలీసులకు జాతీయస్థాయిలో నాలుగు అవార్డులు దక్కాయని డీజీపీ గౌతమ్ సవాంగ్ తెలిపారు. కృత్రిమ మేథస్సు, డిజిటల్ హెల్త్ ప్రొఫైల్, కొవిడ్ ట్రాకర్, యూనిఫైడ్ కమ్యూనికేషన్​లకు టెక్ సభ అవార్డ్స్ లభించాయన్నారు. 2019 డిసెంబర్ నుంచి ఇప్పటివరకు 130 బహుమతులను ఏపీ పోలీస్ శాఖ కైవసం చేసుకోవటం ఎంతో ఆనందంగా ఉందన్నారు.

పాస్ పోర్ట్ జారీ విషయంలో దేశంలోనే రాష్ట్రం మొదటి స్థానం దక్కించుకుందని డీజీపీ తెలిపారు. సేవ యాప్ ద్వారా 87 రకాల సర్వీసులను అందిస్తున్నామని డీజీపీ అన్నారు. దిశ యాప్​ను 46 లక్షల మందికి పైగా డౌన్ లోడ్ చేసుకున్నారని గౌతమ్ సవాంగ్ అన్నారు. మహిళలు, చిన్నారుల రక్షణకు ప్రాధాన్యతనిస్తున్నామని తెలిపారు. ఈ హంట్ ద్వారా నిందితుల డేటాను సులువుగా తెలుసుకునే వ్యవస్థను ఏర్పాటు చేశామని డీజీపీ గౌతమ్ సవాంగ్ అన్నారు.

ఇదీ చదవండి:

WEATHER: నైరుతి బంగాళాఖాతంలో స్థిరంగా ఉపరితల ఆవర్తనం..రాగల 24 గంటల్లో

ABOUT THE AUTHOR

...view details