పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించిన పోలీసులకు డీజీపీ గౌతమ్ సవాంగ్ అభినందనలు తెలిపారు. పోలీసుల సేవాభావం, సమయస్పూర్తి, సమన్వయం ప్రశంసనీయమని డీజీపీ కొనియాడారు. ఎక్కడా రీపోలింగ్‌కు ఆస్కారం లేకుండా ఎన్నికలు నిర్వహించామన్న డీజీపీ... 2013తో పోలిస్తే ఈసారి ఎన్నికల్లో అత్యంత స్వల్ప ఘర్షణలు చోటుచేసుకున్నాయన్నారు. మున్సిపల్, పరిషత్ ఎన్నికల్లో ఇదే స్ఫూర్తి కొనసాగిస్తామన్నారు. పోలీసులకు అందరికీ కరోనా టీకాలు అందేలా చర్యలు తీసుకుంటామని సవాంగ్ స్పష్టం చేశారు.
ఎన్నికల్లో పోలీసుల సేవలు అభినందనీయం: డీజీపీ - పంచాయతీ ఎన్నికలపై డీజీపీ వ్యాఖ్యలు
పంచాయతీ ఎన్నికల్లో పోలీసులు కనబరిచిన స్ఫూర్తి ప్రశంసనీయమని డీజీపీ గౌతమ్ సవాంగ్ అన్నారు. వచ్చే మున్సిపల్ ఎన్నికల్లోనూ ఇదే విధంగా కొనసాగిస్తామన్నారు.
డీజీపీ గౌతమ్ సవాంగ్