గవర్నర్ పిలుపు మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని, డీజీపీ గౌతంసవాంగ్, సీఎంవో అధికారి రాజ్‌భవన్‌కు వచ్చారు. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై గవర్నర్‌తో చర్చించారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ లేఖ, కరోనా నివారణకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను గవర్నర్‌కు వివరించారు. స్థానిక సంస్థల ఎన్నికల వాయిదా అనంతరం రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులపై అధికారులు గవర్నర్‌కు వివరించారు. కరోనాను నివారించేందుకు అన్ని శాఖల సమన్వయంతో ముందస్తు జాగ్రత్తలు ఏ విధంగా తీసుకుంటున్నారో గవర్నర్‌కు చెప్పారు.
గవర్నర్‌తో సీఎస్, డీజీపీ, సీఎంవో అధికారి భేటీ
సీఎస్ నీలం సాహ్ని, డీజీపీ గౌతంసవాంగ్, సీఎంవో అధికారి గవర్నర్ బిశ్వభూషణ్‌తో సమావేశమయ్యారు. రాజ్‌భవన్ నుంచి వచ్చిన పిలుపు మేరకు అధికారులు గవర్నర్‌తో భేటీ అయ్యారు. రాష్ట్రంలో తాజా పరిస్థితులపై గవర్నర్‌కు అధికారులు వివరించినట్లు తెలుస్తోంది.
గవర్నర్‌తో సీఎస్, డీజీపీ, సీఎంవో అధికారి భేటీ