రేషన్‌డీలర్ల వేధింపుల కేసులో హైకోర్టుకు హాజరైన డీజీపీ - అమరావతి తాజా వార్తలు
13:06 September 30
రేషన్‌డీలర్లను వేధించొద్దని గతంలో ఆదేశాలిచ్చిన హైకోర్టు
రేషన్ బియ్యం పేరుతో రేషన్‌డీలర్లు, వాహనదారులను పోలీసులు వేధిస్తున్నారన్న పిటిషన్‌పై హైకోర్టు విచారణ జరిపింది. హైకోర్టు ఆదేశాల మేరకు రాష్ట్ర డీజీపీ.. కోర్టుకు హాజరయ్యారు. అక్రమంగా రేషన్‌బియ్యం తరలిస్తున్నారనే పేరుతో వేధిస్తున్నారని కర్నూలు రైస్‌మిల్ యజమాని పిటిషన్ వేసిన విషయం తెలిసిందే. అయితే రేషన్‌డీలర్లను వేధించొద్దని గతంలో ఆదేశాలిచ్చినా.. ఎందుకు వేధిస్తున్నారో డీజీపీ వివరణ ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది. హాజరైన డీజీపీ.. ఎస్‌ఐ, ఏఎస్‌ఐను సస్పెండ్ చేశామని వివరణ ఇచ్చారు. విచారణ అనంతరం కోర్టు నుంచి డీజీపీ వెళ్లిపోయారు.
ఇటీవల హైకోర్టు: రేషన్ బియ్యం పేరుతో రైసు మిల్లర్లను, వాహనదారులను పోలీసులు వేధించటంపై కర్నూలు జిల్లా కల్లూరుకు చెందిన సౌదామిని రైస్ మిల్లు కేసుపై హైకోర్టులో విచారణ జరిగింది. 'ఎసెన్షియల్ కమోడిటీస్' చట్టంలోని నిబంధనలకు వ్యతిరేకంగా పోలీసులు వ్యవహరిస్తున్నారని న్యాయవాది రవితేజ న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు. నిబంధనలు పాటించకుండా రైస్ మిల్లులోని ఐదు వాహనాలను సీజు చేశారని తెలిపారు. జిల్లా అధికారులకు తెలియచేసినా ఎటువంటి ఫలితం లేదన్నారు. కేసు నమోదు చేశారు కానీ... నిబంధనల ప్రకారం కలెక్టర్‌కు నివేదించలేదన్నారు. అక్కడ అక్రమంగా బియ్యం తరలింపు జరుగుతుందని పోలీసు తరుఫు న్యాయవాది వాదనలు వినిపించారు.
ఇవీ చదవండి: