తెలంగాణలోని ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారం చిన్న జాతర ఫిబ్రవరి 24 నుంచి ప్రారంభం కానుండడంతో... భక్తులు వన దేవతల దర్శనానికి తరలివస్తున్నారు. సమ్మక్క సారలమ్మ గద్దెల వద్ద భక్తులు పోటెత్తారు. రాష్ట్రం నలుమూలల నుంచే కాకుండా ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ నుంచి మేడారం సొంత వాహనాలలో చేరుకుంటున్నారు. జంపన్న వాగులో పుణ్యస్నానాలు ఆచరించి, తలనీలాలు సమర్పించుకుని వనదేవతల సన్నిధికి చేరుకుంటున్నారు.
మేడారం చిన్న జాతర: సమ్మక్క సారలమ్మల దర్శనానికి పోటెత్తిన భక్తులు - mini medaram jatara 2021 dates news
తెలంగాణలోని ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారం సమ్మక్క సారలమ్మల దర్శనానికి గద్దెల వద్ద భక్తులు పోటెత్తారు. రాష్ట్రం నలుమూలల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా అధిక సంఖ్యలో తరలివస్తున్నారు.
devotees throng in mini medaram jatara
అమ్మవార్లకు పసుపు, కుంకుమ, పూవులు, కొబ్బరికాయ కొట్టి... నైవేధ్యం, చీరలు సమర్పించుకుంటున్నారు. కుటుంబ సమేతంగా వచ్చిన భక్తులు సమ్మక్క, సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజులను దర్శించుకుంటున్నారు. వనదేవతలకు మనసారా మొక్కి తిరుగు ప్రయాణంలో అడవుల్లో చెట్ల కింద విందు ఏర్పాటు చేసుకుంటున్నారు.
ఇదీ చదవండి:రేపు సుప్రీంలో పంచాయతీ ఎన్నికల కేసు విచారణ.. బెంచ్ మార్పు