ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

మేడారంలో సెల్​ఫోన్​ ఛార్జింగ్​@రూ.30 - మేడారం భక్తులకు ఫోన్​ ఛార్జింగ్​ కష్టాలు

మేడారం జాతరకు సర్వసిద్ధం చేసిన తెలంగాణ ప్రభుత్వం దూరప్రాంత భక్తుల కోసం ఛార్జింగ్​ పాయింట్ల ఏర్పాటును మరిచింది. ఇదే అదనుగా వ్యాపారులు ఒక్కో ఫోన్​ ఛార్జింగ్​ చేసేందుకు 20 నుంచి 30 రూపాయిలు వసూలు చేస్తున్నారు.

medaram_charging points
మేడారంలో సెల్​ఫోన్​ ఛార్జింగ్​@రూ.30

By

Published : Feb 6, 2020, 1:04 AM IST

మేడారంలో సెల్​ఫోన్​ ఛార్జింగ్​@రూ.30

తెలంగాణలోని మేడారం జాతర కిక్కిరిసిపోయింది. లక్షలాదిగా తరలి వచ్చే భక్తులతో పూర్తిగా జనసంద్రమైంది. అక్కడి ప్రభుత్వం... పటిష్ఠ ప్రణాళికతో అన్ని ఏర్పాట్లు చేసింది. వేల మంది ప్రభుత్వ సిబ్బందిని నియమించింది. దూర ప్రాంతాల వారి బసచేసేందుకు గుడారాలను నిర్మించింది. కానీ చరవాణి ఛార్జింగ్​ చేసేందుకు మాత్రం సరైన సౌకర్యలు కల్పించలేదు.

ఇదే అదనుగా భావించిన కొందరు వ్యాపారులు ఒక్కో చరవాణి ఛార్జింగ్​కు 20 నుంచి 30 రూపాయిలు వసూలు చేస్తున్నారు. గత్యంతరం లేక భక్తులు వీరిని ఆశ్రయిస్తున్నారు. అధికారులు స్పందించి ఛార్జింగ్​ పాయింట్లను ఏర్పాటుచేయాలని భక్తులు కోరుతున్నారు.

ఇవీ చూడండి-ఎస్​వీబీసీ ఎండీగా తితిదే అదనపు ఈవో ధర్మారెడ్డి

ABOUT THE AUTHOR

...view details