ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

తెలంగాణ : సమ్మక్క సారలమ్మల దర్శనానికి పోటెత్తిన భక్తజనం - Sammakka Saralamma nymphs at the Medaram Jatara in the Thadwai Zone of Mulugu District

తెలంగాణలోని ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారం చిన్న జాతరకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు. సమ్మక్క సారలమ్మని దర్శించుకుని ముడుపులు చెల్లించుకుంటున్నారు.

తెలంగాణ : సమ్మక్క సారలమ్మల దర్శనానికి పోటెత్తిన భక్తజనం
తెలంగాణ : సమ్మక్క సారలమ్మల దర్శనానికి పోటెత్తిన భక్తజనం

By

Published : Feb 27, 2021, 3:47 PM IST

తెలంగాణలోని ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారం జాతరలో సమ్మక్క సారలమ్మ వనదేవతల దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు. కుటుంబ సమేతంగా వచ్చిన భక్తులు జంపన్నవాగులో పుణ్యస్నానాలు ఆచరించి అమ్మవార్ల దర్శనం కోసం లైన్లలో బారులు తీరారు.

ఈ నెల 24 నుంచి జరుగుతున్న చిన్న జాతర ఈ రోజుతో ముగుస్తుండటంతో.. భక్తులు రాష్ట్ర నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు. పసుపు కుంకుమ, కొబ్బరికాయలు కొట్టి, నిలువెత్తు బంగారం (బెల్లం) సమర్పిస్తున్నారు.

ఇదీచదవండి.

రాష్ట్రంలో 21 మంది స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ల బదిలీ

ABOUT THE AUTHOR

...view details