తెలంగాణ రాష్ట్రం ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారం జాతరలో అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు. ఛత్తీస్గఢ్, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర నుంచి సమ్మక్క సారలమ్మ వనదేవతల దర్శనం కోసం తరలివస్తున్నారు.
జంపన్నవాగులో భక్తులు పుణ్యస్నానాలు ఆచరించి కళ్యాణ కట్టలో తలనీలాలు సమర్పించుకుంటున్నారు. కుటుంబ సమేతంగా నిలువెత్తు బంగారం (బెల్లం), కొబ్బరి కాయలు, పూలు, పండ్లు, పసుపు, కుంకుమ, చీరెలతో మొక్కులు తీర్చుకుంటున్నారు.