ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

తెలంగాణ: భక్తులతో కిటకిటలాడిన యాదాద్రి - యాదాద్రి లేటెస్ట్ న్యూస్

కార్తిక మాసం అందులోనూ ఆదివారం కావడంతో యాదాద్రి క్షేత్రం భక్తులతో కిటకిటలాడుతోంది. పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి వ్రతాలు జరుపుతున్నారు. కరోనా నిబంధనలకు అనుగుణగా భక్తులను అధికారులు అనుమతిస్తున్నారు.

devotees-at-yadadri-lakshmi-narasimha-swamy
భక్తులతో కిటకిటలాడిన యాదాద్రి

By

Published : Nov 29, 2020, 1:28 PM IST

కార్తిక మాసం పైగా... ఆదివారం కావడంతో తెలంగాణలోని యాదాద్రి శ్రీలక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి భక్తులు తరలివచ్చారు. స్వామివారి సన్నిధిలో పెద్ద ఎత్తున సత్యనారాయణస్వామి వ్రతాలు నిర్వహిస్తున్నారు. భక్తులు కుటుంబ సమేతంగా వ్రతాల్లో పాల్గొని మొక్కలు తీర్చుకుంటున్నారు. స్వామివారి దర్శనానికి ఒకగంట సమయం పడుతోంది.

థర్మల్ స్క్రీనింగ్, శానిటైజేషన్ అనంతరమే భక్తులను ఆలయంలోకి అనుమతిస్తున్నారు. ఆలయ పరిసరాలు, ప్రసాదాల కౌంటర్లు, కల్యాణ మండపం, దర్శన క్యూలైన్లు, కల్యాణ కట్ట, వసతి గృహాల సముదాయం వద్ద భక్తుల రద్దీ కనిపిస్తోంది.

ఇదీ చదవండి:మరో వాయుగుండం! 48 గంటల్లో తుపానుగా మారే అవకాశం

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details