ద్రవ్యవినిమయ బిల్లు ఆమోదం కంటే రాజధాని మార్పు బిల్లే ముఖ్యమంత్రికి ముఖ్యమా అని మాజీ మంత్రి దేవినేని ఉమ నిలదీశారు. పెద్దల సభలో ఒక ఎమ్మెల్సీని తన్నిన మంత్రి, తొడగొట్టిన మంత్రి, ఎమ్మెల్సీని ఏరా అన్న మంత్రులు ఉండడం దురదృష్టమని ఆవేదన వ్యక్తం చేశారు. రాజ్యాంగ సంక్షోభం కోసమేనా జగన్ ఒక్కఛాన్స్ అడిగింది అని ఎద్దేవా చేస్తూ ట్వీట్ చేశారు.
ఇటువంటి మంత్రులు ఉండటం దురదృష్టకరం
ముఖ్యమంత్రి జగన్పై తెదేపా నేత దేవినేని ఉమ ధ్వజమెత్తారు. రాజ్యాంగ సంక్షోభం కోసమేనా ప్రజల్ని ఒక్క ఛాన్స్ ఇవ్వమని అడిగింది అని నిలదీశారు.
ముఖ్యమంత్రిపై దేవినేని ఉమ ధ్వజం