చంద్రబాబు పర్యటన ప్రకటిస్తేనే... అమరావతిలో పనులు చేయాలనే విషయం సీఎంకు గుర్తొచ్చిందని తెదేపా నేత దేవినేని ఉమామహేశ్వరరావు పేర్కొన్నారు. జగన్కు వెన్నులో వణుకు వస్తోందని ధ్వజమెత్తారు. రైతుల త్యాగాలను మంత్రి బొత్స శ్మశానంతో పోల్చటం దుర్మార్గమని మండిపడ్డారు. ఎన్నో చట్టాలు శాసనసభలో ఆమోదం పొందితే... అది శ్మశానంలా కనిపిస్తుందా అంటూ నిలదీశారు. వేలాది మంది రైతులకు ఇళ్లు కట్టించి ఇచ్చామని, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఉన్నతాధికారులకు పూర్తికావస్తుంటే... మంత్రి బొత్స అమరావతిని శ్మశానంతో పోల్చుతారా అంటూ ప్రశ్నించారు.
'చంద్రబాబు పర్యటన ప్రకటిస్తే సీఎంకు వణుకుపుట్టింది' - రాజధానిపై మాట్లాడిన తెదేపా నేత దేవినేని ఉమ
అమరావతిపై మంత్రి బొత్స మాట్లాడిన వ్యాఖ్యలపై తెదేపా నేత దేవినేని ఉమ స్పందించారు. తెదేపా అధినేత చంద్రబాబు అమరావతి పర్యటనను ప్రకటించగానే... జగన్కు అమరావతి పనులు గుర్తొచ్చాయంటూ వ్యంగ్యాస్త్రాలు వేశారు.
'చంద్రబాబు పర్యటన ప్రకటిస్తే సీఎంకు చలొచ్చింది'