ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'తప్పు చేస్తున్నారు కాబట్టే సీఎం జగన్ భయపడుతున్నారు'

అమరావతి విషయంలో తప్పు చేస్తున్నందునే ముఖ్యమంత్రి జగన్ భయపడుతున్నారని మాజీ మంత్రి, తెదేపా నేత దేవినేని ఉమ అన్నారు. 10 వేల మంది పోలీసులను మోహరించి అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఎద్దేవా చేశారు.

devineni uma fires on ycp government
దేవినేని ఉమామహేశ్వరరావు

By

Published : Jan 19, 2020, 7:04 PM IST

దేవినేని ఉమామహేశ్వరరావు

మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లోనూ లేని బలగాలను అమరావతిలో మోహరించారని మాజీ మంత్రి దేవినేని ఉమ విమర్శించారు. తప్పు చేస్తున్నందునే సీఎం జగన్ భయపడుతున్నారని అన్నారు. 10 వేల మంది పోలీసులతో అసెంబ్లీ నిర్వహించే పరిస్థితి ఎందుకు వచ్చిందని ప్రశ్నించారు. విశాఖలో రాజధానిపై ప్రజా బ్యాలెట్‌ను ప్రభుత్వం ఎందుకు అడ్డుకుందని నిలదీశారు. విశాఖలో 52 వేల ఎకరాలు చేతులు మారాయని.. భూములు అమ్ముకోవటానికే రాజధాని తరలింపు ప్రతిపాదన తెచ్చారని ఆరోపించారు. అమరావతిని చంపేస్తే... హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్ పెరిగేలా తెలంగాణ సీఎం కేసీఆర్​తో జగన్ అంతర్గత ఒప్పందం చేసుకున్నారని అన్నారు. దేశంలో డమ్మీ కాన్వాయ్‌తో వెళ్లే సీఎం.. జగన్ ఒక్కరే అని ఎద్దేవా చేశారు.

ABOUT THE AUTHOR

...view details