ప్రజలకు ధైర్యం చెప్పకుండా అందరికీ వైరస్ సోకుతుందంటూ ముఖ్యమంత్రి చెప్పడం ఏంటని మాజీ మంత్రి దేవినేని ఉమ ఆగ్రహం వ్యక్తం చేశారు. కరోనాతో కలిసిమెలిసి జీవించాలి అంటారా అని నిలదీశారు. ప్రజలకు ధైర్యం చెప్పాల్సిన ప్రభుత్వమే ఇలా మాట్లాడటం సమంజసం కాదన్నారు. కట్టడి చేయాల్సిన ప్రభుత్వం లాక్డౌన్ ఎత్తివేయాలనే ఆలోచన చేస్తుందా అంటూ ప్రశ్నించారు. మానవజాతి ఉనికికి సవాలుగా మారిన కరోనా వైరస్ గురించి సీఎం జగన్ రికార్డెడ్ ప్రెస్ మీట్లో బాధ్యతరాహిత్యంగా మాట్లాడటం ఏంటని ట్విట్టర్లో స్పందించారు.
కట్టడి చేయకుండా లాక్డౌన్ ఎత్తివేస్తారా! - devineni uma tweets latest updates
కరోనా వైరస్ గురించి ముఖ్యమంత్రి జగన్ ప్రెస్ మీట్లో మాట్లాడిన తీరుపై మాజీ మంత్రి దేవినేని ఉమ అసంతృప్తి వ్యక్తం చేశారు. కట్టడి చేయాల్సిన ప్రభుత్వం లాక్డౌన్ ఎత్తేసే ఆలోచనలో ఉందా అని అడిగారు.
సీఎం మాటలపై ట్వట్టర్లో స్పందించిన దేవినేని ఉమ