ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ఉద్యమాన్ని అణిచివేసేందుకే అక్రమ కేసులు:దేవినేని - three capitals for ap news

రాజధాని ఉద్యమాన్ని అణిచివేసేందుకు వైకాపా ప్రభుత్వం ప్రయత్నిస్తోందని దేవినేని ఉమామహేశ్వరరావు ఆరోపించారు. ప్రశ్నిస్తే... పోలీసులు కేసులు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

devineni uma fire on cm jagan
devineni uma fire on cm jagan

By

Published : Feb 3, 2020, 4:42 PM IST


రాజధాని రైతుల ఉద్యమాన్ని అణిచివేసేందుకు వైకాపా ప్రభుత్వం తప్పుడు కేసులు పెడుతుందని మాజీ మంత్రి దేవినేని ఉమ ఆరోపించారు. నందిగామలో రైతులు చేస్తున్న రిలే నిరహారదీక్షకు ఆయన సంఘీభావం తెలిపారు. అనంతరం మాట్లాడిన ఆయన... సామరస్యపూర్వకంగా ఎంపీని ప్రశ్నిస్తే కేసులు పెట్టడమేంటని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి జగన్ హిట్లర్ మాదిరిగా.. పరిపాలన కొనసాగిస్తున్నారని మండిపడ్డారు. రాజధాని అమరావతిపై పునరాలోచించుకోవాలని కోరారు.

ABOUT THE AUTHOR

...view details