ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'కొల్లు రవీంద్రపై కక్ష సాధింపు చర్యలకు దిగుతున్నారు' - tdp leader kollu ravindra news

మాజీ మంత్రి కొల్లు రవీంద్రపై ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు దిగుతోందని మాజీ మంత్రి దేవినేని ఉమా ఆరోపించారు. పేర్ని నానిపై దాడి ఘటనలో విచారణ పేరుతో వేధించాలని చూడటం సరికాదన్నారు. కొల్లుకు మద్దతుగా యావత్తు పార్టీ అండగా ఉంటుందని స్పష్టం చేశారు.

devineni uma
devineni uma

By

Published : Dec 4, 2020, 5:51 PM IST

రాష్ట్ర ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు మానుకోకుంటే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని మాజీ మంత్రి దేవినేని ఉమా హెచ్చరించారు. మంత్రి పేర్నినానిపై దాడి ఘటనకు సంబంధించి విచారణ పేరుతో కొల్లు రవీంద్రను పోలీసు స్టేషన్​కు పిలిపించటం సరికాదన్నారు. కొల్లు నివాస గృహానికి వచ్చిన దేవినేని మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో జరుగుతున్న అరాచాకాలు, అక్రమాలన్నీ మంత్రులు, ప్రజా ప్రతినిధుల కనుసన్నల్లోనే జరుగుతున్నాయని ఆరోపించారు. పేర్ని నానిపై జరిగిన దాడిని ఖండిస్తున్నామన్నారు. దాడి ఘటనను ఆసరాగా చేసుకుని రాజకీయాలకు పాల్పడితే కొల్లుకు మద్దతుగా యావత్తు పార్టీ అండగా నిలుస్తుందన్నారు.

ABOUT THE AUTHOR

...view details