ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'ప్రజావేదికను మళ్లీ కడతాం.. వైకాపా అరాచకాలను మ్యూజియంలో పెడతాం' - prajavedika demolition

తెదేపా అధికారంలోకి రాగానే ప్రజావేదికతో పాటు అమరావతిని మళ్లీ నిర్మిస్తామని తెదేపా నేత, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరావు అన్నారు. ప్రజావేదిక కూల్చివేతతో జగన్ ఏం సాధించారని ప్రశ్నించారు.

devineni uma
devineni uma

By

Published : Jun 25, 2020, 1:14 PM IST

తెదేపా నేత, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరావు

ప్రజావేదిక కూల్చడం ద్వారా వైకాపా ప్రభుత్వం సాధించిందేమిటో ప్రజలకు చెప్పాలని మాజీ మంత్రి దేవినేని డిమాండ్ చేశారు. పరిపాలన అంటే భవనాలను కూల్చడం కాదని హితవు పలికారు. తెదేపా అధికారంలోకి రాగానే ప్రజావేదిక, అమరావతిని మళ్లీ నిర్మిస్తామని చెప్పారు.

"వైకాపా ప్రభుత్వ అరాచకాలను ప్రజావేదికలో ఏర్పాటు చేయబోయే మ్యూజియంలో పెడతాం" అని చెప్పారు. ఏడాది కాలంలో పోలీసుల సాయంతో వైకాపా ప్రభుత్వం అన్యాయంగా వ్యవహరిస్తోందని దేవినేని ఉమా ఆగ్రహించారు.

ABOUT THE AUTHOR

...view details