ధరల స్థిరీకరణ నిధి పేరుతో ఏర్పాటు చేసిన 3 వేల కోట్ల నిధులు ఏమయ్యాయని... మాజీమంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. స్థిరీకరణ నిధి ఏమైందో సీఎం జగన్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం సకాలంలో పంటలను కొనుగోలు చేసి ఉంటే రైతులకు ఈ దుస్థితి వచ్చేదికాదన్నారు. తడిసిన ధాన్యం, దెబ్బతిన్న మామిడి, మొక్కజొన్న, తీగజాతి పంటలను మద్దతు ధరకు కొనుగోలు చేయాలని దేవినేని డిమాండ్ చేశారు.
తడిసిన ధాన్యాన్ని మద్దతు ధరకు కొనండి: దేవినేని ఉమ - వైసీపీపై దేవినేని ఉమా కామెంట్స్
ధరల స్థిరీకరణ కోసం ఏర్పాటు చేసిన రూ.3 వేల కోట్ల నిధి ఏమైందని మాజీమంత్రి దేవినేని ఉమ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల రైతులకు అపార నష్టం వచ్చిందన్నారు. అకాల వర్షం వల్ల నష్టపోయిన రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. తడిసిన ధాన్యాన్ని మద్దతు ధరకు కొనుగోలు చేయాలని ట్వీట్టర్ వేదికగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
![తడిసిన ధాన్యాన్ని మద్దతు ధరకు కొనండి: దేవినేని ఉమ దేవినేని ఉమా](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6945599-63-6945599-1587899442215.jpg)
దేవినేని ఉమా