ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'రాష్ట్ర ప్రయోజనాలకు విరుద్ధంగా పోలవరం ఎత్తు తగ్గిస్తున్నారు' - Devineni Uma comments on polavaram

పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గిస్తున్నారని తెదేపా ముఖ్యనేత దేవినేని ఉమ ఆరోపించారు. ఇది రాష్ట్ర ప్రయోజనాలకు విరుద్ధమని వ్యాఖ్యానించారు. 45.72 మీటర్లకే నిర్మాణం జరిగి తీరాలని దేవినేని ఉమ స్పష్టం చేశారు. నిర్వాసితులు, రైతుల పక్షాన పోరాడేందుకు తెదేపా సిద్ధంగా ఉందని చెప్పారు.

Devineni Uma criticize ycp Government over Polavaram Height
దేవినేని ఉమ

By

Published : Nov 13, 2020, 2:52 PM IST

రాష్ట్ర ప్రయోజనాలకు విరుద్ధంగా పోలవరం ఎత్తు తగ్గిస్తున్నారని మాజీమంత్రి దేవినేని ఉమ ఆరోపించారు. నాలుగున్నర మీటర్లకు పైగా ఎత్తు తగ్గించేందుకు సిద్ధమయ్యారని వివరించారు. పోలవరం 45.72 మీటర్లకే నిర్మాణం జరిగి తీరాలని దేవినేని ఉమ స్పష్టం చేశారు. 150 అడుగుల్లో నిర్మాణం చేపట్టి 194 టీఎంసీల నీరు నిలబెట్టాలని పేర్కొన్నారు. నిర్వాసితులకు రూ.27,500కోట్లు పరిహారం చెల్లించాల్సిందేనని స్పష్టం చేశారు. ప్రధానికి ఉత్తరం రాసి చేతులు దులుపుకోవడం తప్ప ఇంకేం చేశారని నిలదీశారు. నిర్వాసితులు, రైతుల పక్షాన పోరాడేందుకు తెదేపా సిద్ధంగా ఉందని దేవినేని ఉమ ఉద్ఘాటించారు.

ABOUT THE AUTHOR

...view details