ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

జగన్ చేతకాని తనంతోనే రాష్ట్రం దివాళా: దేవినేని ఉమా

వైకాపా పాలనపై తెదేపానేత దేవినేని ఉమా తీవ్రవ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి జగన్ చేతకాని తనంతోనే రాష్ట్రం దివాళా తీసిందని దేవినేని అన్నారు.

Devineni uma
దేవినేని ఉమా

By

Published : Apr 6, 2021, 9:21 PM IST

ముఖ్యమంత్రి జగన్ చేతకాని తనంతోనే రాష్ట్రం దివాళా తీసిందని మాజీమంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ధ్వజమెత్తారు. వైకాపా పాలనలో కొత్త ఉద్యోగాల కల్పన లేకపోగా... ఉన్న ఉద్యోగులకు జీతాలు కూడా లేవని ఓ ప్రకటనలో మండిపడ్డారు.

"రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచింది చంద్రబాబేనని సజ్జల అనటం ఆయన దివోళాకోరు తనానికి నిదర్శనం. ఆర్థిక శాస్త్రవేత్తల ప్రశంసలు అందుకున్న చంద్రబాబు విధానాల్ని మిడిమిడి జ్ఞానంతో తప్పుపట్టడం అవగాహనా రాహిత్యం. పేరుకు సలహాదారైన సజ్జల అప్రకటిత ఖజానాకు కొత్వాల్. అవినీతి, అసమర్థ, చీకటి రాజకీయాలు ఇకనైనా మానుకోవాలి. ఖజానానంతా పార్టీ రంగులకు, ప్రభుత్వ ప్రకటనలకే దుబారాగా దోచిపెట్టి రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టారు. ఆర్థిక కట్టుబాటు లేక ప్రతి పౌరుడిపైనా రూ.2.50లక్షల అప్పు భారం మోపారు. రెండేళ్లలో జగన్మోహన్ రెడ్డి రాష్ట్రానికి ఎన్ని ప్రాజెక్టులు, పరిశ్రమలు తెచ్చి ఉపాధి కల్పించారు. పెద్దిరెడ్డి డబ్బు సంచులు లేకుండా తిరుపతి ఉపఎన్నికలో పోటీచేసే ధైర్యం మీకుందా" అని దేవినేని నిలదీశారు.

ABOUT THE AUTHOR

...view details