ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'కర్నూలులో పర్యటించే ధైర్యం ఉందా సీఎం గారూ?' - ఏపీలో కరోనా కేసుల సంఖ్య

రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజు రోజుకూ పెరిగిపోతోందని మాజీ మంత్రి దేవినేని ఉమ ఆవేదన వ్యక్తం చేశారు. ఏపీలో కరోనా వ్యాప్తి వేగంగా వ్యాపిస్తున్న విషయం సీఎం జగన్ కు తెలుస్తోందా.. అని ప్రశ్నించారు.

devineni uma
devineni uma

By

Published : Apr 27, 2020, 12:16 PM IST

కర్నూలులో పర్యటించే ధైర్యం ముఖ్యమంత్రి జగన్ కు ఉందా అని తెదేపా నేత, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ప్రశ్నించారు. నెల రోజుల్లో ఏపీలో కరోనా కేసులు 137 రెట్లు పెరిగాయని ఆయన మండిపడ్డారు. కరోనా మహమ్మారి వేగంగా వ్యాపిస్తున్న విషయం ముఖ్యమంత్రికి తెలుస్తోందా అని అనుమానం వ్యక్తం చేశారు.

తాడేపల్లి రాజప్రసాదం నుంచి జగన్ బయటకు వచ్చి ప్రజల్లోకి వెళ్తే... వాస్తవాలు తెలుస్తాయని హితవు పలికారు. రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుంటుందో చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్రంలో 12 జిల్లాలు రెడ్ జోన్ లోకి వెళ్లాయని.. ఇకనైనా కేసులు, రిపోర్టుల విషయాల్లో నిజాలను ప్రజల ముందు ఉంచాలని ఆయన డిమాండ్ చేశారు.

ABOUT THE AUTHOR

...view details