లక్షల టన్నుల ఇసుక మాయమైందన్న మంత్రిని ఎందుకు అరెస్ట్ చెయ్యలేదో జగన్ సమాధానం చెప్పాలని మాజీ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు డిమాండ్ చేశారు. తప్పుడు కేసులతో ఆగమేఘాల మీద తెదేపా నాయకుల అరెస్టు చేస్తూ... కక్ష తీర్చుకోవడానికి కరోనా సమయాన్ని వాడుకుంటున్నారని ట్విటర్ వేదికగా మండిపడ్డారు. వైకాపా అధికారంలోకి వచ్చాక టెలీహెల్త్ కు 3కోట్ల రూపాయలు చెల్లించిన మంత్రిపై చర్యలు ఎందుకు తీసుకోలేదని నిలదీశారు
'కక్ష తీర్చుకోవడానికి కరోనా సమయాన్ని వాడుకుంటున్నారు'
తెదేపా నేతలపై కక్ష తీర్చుకోవడానికి కరోనా సమయాన్ని వాడుకుంటున్నారన్న మాజీ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు అన్నారు. తప్పుడు కేసులు పెట్టి అరెస్టులు చేస్తున్నారని ఆరోపించారు.
'కక్ష తీర్చుకోవడానికి కరోనా సమయాన్ని వాడుకుంటున్నారు'