నిర్వాసితులను పట్టించుకోకుండా.. వ్యక్తిగత ప్రయోజనాల కోసమే సీఎం జగన్ పోలవరం పర్యటన చేశారని తెదేపా సీనియర్ నేత దేవినేని ఉమ ఆరోపించారు. 100 అడుగుల వైఎస్ విగ్రహం, పాపికొండల్లో 800 కోట్ల రూపాయలతో అతిథి గృహాల సర్వే కోసం హెలికాఫ్టర్లో పర్యటించారని ధ్వజమెత్తారు. తన పోలవరం పర్యటన ద్వారా ఏం సాధించారో ప్రజలకు చెప్పే ధైర్యం ముఖ్యమంత్రికి లేదని ఎద్దేవా చేశారు. దాదాపు లక్ష కుటుంబాలు పరిహారం, పునరావాసం కోసం ఎదురుచూస్తుంటే.. పోలీసుల అండతో వారిని అడ్డుకోవడం సిగ్గుచేటన్నారు.
'వ్యక్తిగత ప్రయోజనాల కోసమే సీఎం పోలవరం పర్యటన'
వ్యక్తిగత ప్రయోజనాల కోసమే సీఎం పోలవరం పర్యటన చేశారని దేవినేని ఉమ ఆరోపించారు. 100 అడుగుల వైఎస్ విగ్రహం కోసం సర్వే చేశారని విమర్శించారు. పోలవరం పర్యటనతో ఏం సాధించారో ప్రజలకు చెప్పాలన్నారు. నిర్వాసితుల పరిహారం, పునరావాసం అంశాన్ని గాలికొదిలేశారని దుయ్యబట్టారు.
'తన పోలవరం పర్యటన ద్వారా ఏం చేశారో ప్రజలకు చెప్పే ధైర్యం ముఖ్యమంత్రికి లేదు. ప్రాజెక్టు నిర్మాణం ఎప్పటిలోగా పూర్తిచేస్తారని ఎదురు చూస్తున్న ప్రజలకు ధైర్యం ఉంటే సమాధానం చెప్పాలి. తెదేపా ప్రభుత్వ హయాంలో చేసిన పనులకు కేంద్రం నుంచి నాబార్డు ద్వారా రూ.4400కోట్లు వస్తే వాటిని నిర్వాసితులకు కట్టకుండా మద్యం కంపెనీలకు ఖర్చు చేశారు. ఏఏ గ్రామాల్లో ఎంత చెల్లించారో చెప్పే ధైర్యం ముఖ్యమంత్రికి ఉందా. పోలవరం నీటిపారుదల ప్రాజెక్టును 134 జీవో ద్వారా ఎత్తిపోతల పథకంగా మార్చే అధికారం సీఎం జగన్కు ఎవరిచ్చారు. దీనివల్ల రైతాంగానికి తీవ్ర అన్యాయం జరుగుతుంది. ముఖ్యమంత్రి అసమర్థత వల్లే గోదావరి నీటి యాజమాన్య బోర్డు పరిధిలోకి పోలవరం వెళ్లింది. రూ.55,655 కోట్ల అంచనాలకు సాంకేతిక సలహా కమిటీలో చంద్రబాబు పోలవరం అంచనాలకు అనుమతులు తీసుకొస్తే కేసుల భయంతో రూ.47వేలకోట్లకు సీఎం జగన్ ఒప్పుకున్నారు. 28మంది ఎంపీలన్నా పోలవరానికి నిధులు తీసుకురాలేదు. సీబీఐ, ఈడీ కేసులకు భయపడి ప్రధానిని ఎదిరించలేక 26నెలలుగా మౌనం వహిస్తున్నారు." అని దేవినేని ఉమ ఆరోపించారు.
ఇదీ చదవండి: