ఎవరిపై ఏ కేసులు పెడదామన్న ఆలోచన తప్ప.. పరిపాలన, ప్రజా సంక్షేమంపై పాలకులకు దృష్టి లేదని తెదేపా మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు విమర్శించారు. కక్ష సాధింపు చర్యలే ఎజెండాగా వైకాపా ప్రభుత్వం పని చేస్తోందని ఆరోపించారు. రాష్ట్రంలో ఆర్థిక క్రమశిక్షణ కొరవడిందని.. ఎవరు ఏ నిధులు ఎందుకు వెచ్చిస్తున్నారో అర్ధం కాని పరిస్థితి నెలకొందన్నారు.
తుళ్లూరులో రాజధాని రైతులు చేస్తున్న పోరాటానికి సంఘీభావం తెలిపిన దేవినేని... రాజధాని రైతుల పోరాటం అంతిమంగా నెగ్గుతుందని భరోసానిచ్చారు. అమరావతి పరిరక్షణ కోసం రైతులు, మహిళలు నైతిక స్థైర్యంతో పోరాడుతున్నారని వ్యాఖ్యనించారు.