ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'రాష్ట్రానికి సీఎం జగనా... విజయసాయిరెడ్డా..?' - deveneni uma comments on vishaka lands news

విశాఖలో వైకాపా ప్రజాప్రతినిధులు భూదందా నడుపుతున్నారని తెదేపా నేత దేవినేని ఉమ ఆరోపించారు. రాజధానిపై ఆ పార్టీ ఎంపీ విజయసాయి రెడ్డి చేసిన ప్రకటనను తీవ్రంగా తప్పుబట్టారు. విశాఖ భూముల వ్యవహారంపై సీబీఐ విచారణ జరపాలని డిమాండ్ చేశారు.

deveneni uma comments on ys jagan capital city
deveneni uma comments on ys jagan capital city

By

Published : Dec 28, 2019, 12:21 PM IST

మాట్లాడుతున్న దేవినేని ఉమ

విశాఖలో 36 వేల ఎకరాలకు పైగా ఇన్​సైడర్ ట్రేడింగ్ జరిగిందని తెదేపా నేత దేవినేని ఉమ ఆరోపించారు. విజయవాడలో మీడియాతో మాట్లాడిన ఆయన... రాజధానిపై ప్రభుత్వం వ్యవహారిస్తున్న తీరుపై తీవ్రంగా మండిపడ్డారు. భీమిలి, భోగాపురం విమానాశ్రయం దగ్గర విలువైన భూములను వైకాపా నేతల సన్నిహితులు కోనుగోలు చేశారని ఆరోపించారు. విశాఖలో ఆ పార్టీ ఎంపీ విజయసాయి రెడ్డి రాజధానిపై ఎలా ప్రకటన చేస్తారని నిలదీశారు. ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి విజయసాయిరెడ్డా... లేక జగన్మోహన్ రెడ్డా... అని ప్రశ్నించారు. ఎంపీ విజయసాయి రెడ్డి చేసిన ప్రకటనను సీఎం జగన్ ఖండించాలని డిమాండ్ చేశారు.

ABOUT THE AUTHOR

...view details