ముఖ్యమంత్రి జగన్ మతం మానవత్వం కాదని... మూర్ఖత్వమని మాజీమంత్రి దేవినేని ఉమ ధ్వజమెత్తారు. వైకాపా 6 నెలల పాలనలో రాష్ట్రానికి మొత్తం రూ.67వేల కోట్లు నష్టం జరిగిందని ఆరోపించారు. రాష్ట్ర రెవెన్యూ 17 శాతానికి పడిపోయిందన్న ఉమ... రూ.30వేల కోట్ల ఆదాయం పోయిందన్నారు. ఆరు నెలల్లో రూ.25 వేల కోట్లు అప్పు తెచ్చారని పేర్కొన్నారు.
'ఆయన మతం మానవత్వం కాదు... మూర్ఖత్వం' - వైకాపా ఆరు నెలల పాలనపై ఉమ వ్యాఖ్యలు వార్తలు
వైకాపా ఆరు నెలల పాలనలో రాష్ట్రానికి మొత్తం రూ. 67 వేల కోట్లు నష్టం వాటిల్లిందని... మాజీమంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఆరోపించారు. రాష్ట్ర రెవెన్యూ 17 శాతానికి పడిపోయిందని వివరించారు. సామాన్య మహిళ పద్మజ భావ వ్యక్తీకరణపై స్వేచ్ఛపై ఎందుకు చర్యలు తీసుకున్నారని పోలీసులను ప్రశ్నించారు.

deveneni-uma-comments-on-ycp-six-month-governence
మాట్లాడుతున్న దేవినేని ఉమ
వివిధ బ్యాంకుల ద్వారా తెచ్చిన రూ.12వేల కోట్ల అప్పుతో... మొత్తం అప్పు రూ.37వేల కోట్లకు చేరిందని వివరించారు. పోలవరంలో గత తెదేపా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలన్నీ నియమ నిబంధనలు ప్రకారమే ఉన్నాయని... అదే విషయాన్ని కేంద్రం కూడా స్పష్టం చేసిన విషయం గుర్తుచేశారు. కక్ష, వివక్షలే ఈ ప్రభుత్వ ప్రధాన అజెండాలని ధ్వజమెత్తారు. సామాన్య మహిళ యలమంచిలి పద్మజ భావవ్యక్తీకరణ స్వేచ్ఛపై పోలీసులు ఎందుకు చర్యలు తీసుకున్నారని ప్రశ్నించారు.
ఇదీ చదవండి : 'దాడులను సహించం.. కార్యకర్తలను కాపాడుకుంటాం'