ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెడితే సహించం: దేవినేని - devineni umma comments on cm kcr

పోలవరం ప్రాజెక్ట్ ఎత్తు తగ్గించే విషయమై తెలంగాణ ప్రభుత్వంతో సీఎం జగన్ ఎందుకు లాలూచీ పడ్డారని తెదేపా నేత, మాజీ మంత్రి దేవినేని ఉమ ప్రశ్నించారు. నదీ జలాల విషయంలో ఇరు తెలుగు రాష్ట్రాల సీఎంలు తమ సొంత వ్యవహారంలా చూస్తున్నారని విమర్శించారు.

deveneni uma comments on cm jagan over polavaram project issue

By

Published : Oct 13, 2019, 3:23 PM IST

రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెడితే సహించం: దేవినేని

రాష్ట్ర ప్రయోజనాలను కాపాడాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి జగన్ పై ఉందని తెదేపా నేత దేవినేని అన్నారు. ఏపీ విభజన చట్ట ప్రకారం నదీ జలాల పర్యవేక్షణకు అపెక్స్ కౌన్సిల్ ఏర్పాటైనా... సీఎం జగన్ ఈ కమిటీని పరిగణలోనికి తీసుకోవటం లేదని విమర్శించారు. రాష్ట్రాల మధ్య నదీ జలాల కోసం తలెత్తే అభ్యంతరాలను ఈ కమిటీ పరిష్కరిస్తుందని.. దీనికి సంబంధించి పార్లమెంటు లో చట్టం ఉందని తెలిపారు. ఇరు తెలుగు రాష్ట్రాల సీఎంలు ఈ వ్యవహారాన్ని తమ సొంత వ్యవహారంలా మనం మనం చూసుకుందామంటూ ప్రకటనలు చేయడం దారుణమన్నారు. నదీ వివాదాలు, బ్రిజేష్, బచావత్ ట్రైబ్యునళ్లపై అంతర్రాష్ట్ర అధికారులతో చర్చించారా అని ప్రశ్నించారు. పోలవరంపై కేసులు తదితర అంశాలపై కనీసం ఒక్కసారైనా మాట్లాడారా అని నిలదీశారు. పోలవరం ప్రాజెక్టుపై తెలంగాణ ప్రభుత్వం వేసిన కేసులు వెనక్కి తీసుకుందా అని ప్రశ్నించిన దేవినేని... ప్రాజెక్టు ఎత్తు తగ్గించే విషయమై జగన్ ఎందుకు లాలూచీ పడ్డారని దుయ్యబట్టారు. రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెడితే తెదేపా చూస్తూ ఉరుకోబోదని హెచ్చరించారు.

ABOUT THE AUTHOR

...view details