రాష్ట్ర ప్రభుత్వ సంస్థల్లో నామినేటెడ్ పోస్టులను మంత్రులు ప్రకటించారు. విజయవాడలో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, హోంమంత్రి మేకతోటి సుచరిత రాష్ట్ర, జిల్లా స్థాయిలో పోస్టులకు సంబంధించి ప్రకటన విడుదల చేశారు. 135 కార్పొరేషన్లు, సంస్థల్లో ఛైర్మన్లు, డైరెక్టర్లను నియమించారు.
Nominated posts: ప్రభుత్వ సంస్థల్లో నామినేటెడ్ పోస్టుల ప్రకటన.. అతివకే అందలం - nominated posts in ap latest news
12:10 July 17
Nominated posts
ఈ సందర్బంగా సజ్జల మాట్లాడుతూ.. పదవులేవీ అలంకారప్రాయం కాదని అన్నారు. ఈ ప్రక్రియలో సామాజిక న్యాయం పాటించామని తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు 76 పదవులు కేటాయించామన్నారు. వెనుకబడిన తరగతులకు 56 శాతం పదవులు కేటాయించినట్లు వివరించారు. నామినేటెడ్ పదవుల్లో మహిళలకు పెద్దపీట వేశామని చెప్పారు.
పౌర సరఫరాల కార్పొరేషన్ ఛైర్మన్‌గా ద్వారంపూడి భాస్కర్‌రెడ్డి, వీఎంఆర్డీఏ ఛైర్ పర్సన్‌గా అక్కరమాని విజయనిర్మల, ఏపీఎస్‌ఆర్టీసీ రీజినల్ ఛైర్‌పర్సన్‌గా గాదల బంగారమ్మ, గ్రంథాలయ సంస్థ ఛైర్‌పర్సన్‌గా రెడ్డి పద్మావతి, మారిటైం బోర్టు ఛైర్మన్‌గా విజయనగరం జిల్లాకు చెందిన కాయల వెంకట్‌రెడ్డి, టిడ్కో ఛైర్మన్‌గా జమ్మాన ప్రసన్నకుమార్, డీసీసీబీ ఛైర్మన్‌గా నెక్కల నాయుడుబాబు, కాపు కార్పొరేషన్ ఛైర్మన్‌గా అడపా శేషగిరి, ఏపీ గ్రీనింగ్ బ్యూటీ కార్పొరేషన్ ఛైర్మన్‌గా ఎన్.రామారావు, ఏపీ సామాజిక న్యాయ సలహాదారుగా జూపూడి ప్రభాకర్‌రావు, తిరుపతి స్మార్ట్ సిటీ అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్‌పర్స్‌న్‌గా నరమల్లి పద్మజ, ఉర్దూ అకాడమీ ఛైర్మన్‌గా నసీర్ అహ్మద్, బ్రహ్మణ కార్పొరేషన్ ఛైర్మన్‌గా సుధాకర్, ఏపీఐఐసీ ఛైర్మన్‌గా మెట్టు గోవిందరెడ్డిని నియమించారు.
ఎవరికి ఏ పదవి..?
- ఏపీఎస్ఆర్టీసీ ఛైర్మన్‌గా మల్లికార్జునరెడ్డి
- ఆప్కాబ్ ఛైర్‌పర్సన్‌గా ఎం.ఝాన్సీరెడ్డి
- స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్‌గా కె.అజయ్‌రెడ్డి
- పౌరసరఫరాల కార్పొరేషన్ ఛైర్మన్‌గా ద్వారంపూడి భాస్కర్‌రెడ్డి
- మహిళా సహకార ఆర్థిక కార్పొరేషన్ లిమిటెడ్ ఛైర్‌పర్సన్‌గా బి.హేమమాలినీరెడ్డి
- గ్రీనింగ్ బ్యూటిఫికేషన్ కార్పొరేషన్ ఛైర్మన్‌గా నర్తు రామారావు
- ఉపాధి కల్పన అభివృద్ధి సొసైటీ ఛైర్మన్‌గా శ్యాంప్రసాద్‌రెడ్డి
- మారిటైం బోర్డు ఛైర్మన్‌గా కాయల వెంకటరెడ్డి
- టిడ్కో ఛైర్మన్‌గా జమ్మన ప్రసన్న కుమార్
- ఎడ్యుకేషన్ వెల్‌ఫేర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్‌గా మళ్ల విజయప్రసాద్
- సంప్రదాయేతర ఇంధన వనరుల సంస్థ నెడ్‌క్యాప్ ఛైర్మన్‌గా కె.కన్నప్పరాజు
- రాష్ట్ర బ్రాహ్మణ సంక్షేమ అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్‌గా సీతంరాజు సుధాకర్
- క్రిస్టియన్ మైనారిటీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఛైర్మన్‌గా బొల్లవరపు జాన్ వెస్లీ
- రాష్ట్ర గృహ కార్పొరేషన్ ఛైర్మన్‌గా దావులూరి దొరబాబు
- సైన్స్ అండ్ టెక్నాలజీ అకాడమీ ఛైర్‌పర్సన్‌గా టి.ప్రభావతి
- ఏపీఎంఎస్ఎంఈ కార్పొరేషన్ ఛైర్మన్‌గా వంకా రవీంద్రనాథ్
- లేబర్ బోర్డు వైస్ ఛైర్మన్‌గా డి.నవీన్‌బాబు
- క్షత్రియ సంక్షేమ అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్‌గా పాతపాటి సర్రాజు
- కనీస వేతన సలహా బోర్డు ఛైర్‌పర్సన్‌గా బర్రి లీల
- సాహిత్య అకాడమీ ఛైర్‌పర్సన్‌గా పిల్లిమొగ్గల శ్రీలక్ష్మి
- రోడ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్‌గా కనుమూరు సుబ్బరాజు
- ఫారెస్ట్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్‌గా ఎం.అరుణ్ కుమార్
- కాపు సంక్షేమ అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్‌గా అడపా శేషగిరి
- మైనారిటీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఛైర్మన్‌గా షేక్ ఆసిఫ్
- పారిశ్రామికాభివృద్ధి కార్పొరేషన్ ఛైర్‌పర్సన్‌గా బీఎస్ఎన్ పుణ్యశీల
- కమ్మ సంక్షేమ అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్‌గా తుమ్మల చంద్రశేఖర్
- పర్యాటక అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్‌గా ఎ.వరప్రసాద్ రెడ్డి
- గ్రంథాలయ పరిషత్ ఛైర్మన్‌గా మందపాటి శేషగిరిరావు
- రెడ్డి సంక్షేమ అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్‌గా సత్యనారాయణరెడ్డి
- సామాజిన న్యాయ సలహాదారుగా జూపుడి ప్రభాకర్ రావు
- స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ఛైర్‌పర్సన్‌గా పి.దేవసేన
- రాష్ట్ర ఫైనాన్స్ కార్పొరేషన్ ఛైర్మన్‌గా మేరుగు మురళీధర్
- సీడ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఛైర్‌పర్సన్‌గా సుస్మిత
- సంగీత నృత్య అకాడమీ ఛైర్‌పర్సన్‌గా పి.శిరీష యాదవ్
- పోలీసు హౌసింగ్ కార్పొరేషన్ ఛైర్మన్‌గా చిరంజీవి రెడ్డి
- స్పోర్ట్స్ అథారిటీ ఛైర్మన్‌గా బైరెడ్డి సిద్దార్థరెడ్డి
- మార్క్‌ఫెడ్ ఛైర్మన్‌గా వెంకట సుబ్బారెడ్డి
ఇదీ చదవండి:Chandrababu: 'పూర్తిగా అధ్యయనం చేశాకే గెజిట్‌పై స్పందిస్తా'