కరోనా లక్షణాలతో ఉప తహసీల్దారు మృతి చెందిన ఘటన కడప జిల్లా రాయచోటిలో చోటుచేసుకొంది. మదనపల్లిరోడ్డులోని వెంకటేశ్వర వీధిలో నివాసముండే సుదర్శన్ తీవ్ర జ్వరం, శ్వాస లేని స్థితిలో ఆదివారం అర్ధరాత్రి ఒంటిగంటకు మృతి చెందారు. కోమాలో ఉన్న స్థితిలో పురపాలక సిబ్బంది ఆయనను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా.. కాపాడేందుకు వైద్యులు విశ్వప్రయత్నం చేశారు. మృతుడికి కరోనా లక్షణాలు ఉన్నట్లుగా వైద్యులు భావిస్తున్నారు. భార్య, ఇద్దరు కుమార్తెలు గల సుదర్శన్ రాజంపేట ఉప తహసీల్దార్‌గా పని చేస్తున్నారు. పురపాలక కమిషనర్ రాంబాబు మృతుడి కుటుంబ సభ్యులను ఓదార్చారు.
కరోనా లక్షణాలతో ఉప తహసీల్దారు మృతి
కరోనా లక్షణాలతో ఉప తహసీల్దారు మృతి చెందిన ఘటన కడప జిల్లా రాయచోటిలో చోటుచేసుకొంది.
deputy tahsildar