తెలంగాణ చర్లపల్లి జైలు డిప్యూటీ సూపరింటెండెంట్ సీహెచ్ దశరథంతో.. యువతుల పేరుతో ఇటీవల సైబర్ నేరస్థులు ఛాటింగ్ చేశారు. నగ్నంగా వీడియో కాల్స్ మాట్లాడారు. దాన్ని రికార్డు చేసి.. సామాజిక మాధ్యమాల్లో పెడతామంటూ బెదిరింపులకు దిగారు. సదరు అధికారి ఆ బెదిరింపులను పట్టించుకోకపోవడంతో.. సీబీఐ అధికారి అజయ్‌కుమార్ పాండే పేరుతో నిందితుడు ఫోన్ చేశాడు.
మీ అసభ్య వీడియోపై యూట్యూబ్ నుంచి ఫిర్యాదు అందిందని.. తనకు డబ్బు చెల్లిస్తే తదుపరి చర్యలు తీసుకోబోమని నమ్మించాడు. సీబీఐ పేరుతో నకిలీ లేఖ కూడా పంపాడు. రాహుల్‌శర్మ అనే వ్యక్తి నంబరు ఇచ్చి కాల్ చేయాలని సూచించాడు. బాధితుడు అతడికి ఫోన్ చేశాక.. వీడియోలు తొలగించేందుకు రెండు విడతల్లో రూ.97,500 బదిలీ చేశాడు. ఆ తర్వాత తన దగ్గర మరో రెండు వీడియోలు ఉన్నాయని.. వాటిని వైరల్ చేయకుండా ఉండాలంటే రూ.85 వేలు పంపాలని బెదిరించాడు.