ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్యకు యత్నించిన ఉపసర్పంచ్ కుటుంబంలో విషాదం చోటుచేసుకుంది. ఉపసర్పంచ్ వడ్త్యా బాబురావు, ఆయన భార్య రంగమ్మ ప్రాణాలు కోల్పోయారు.
తెలంగాణ: ఆత్మహత్యాయత్నం చేసిన ఉపసర్పంచ్ దంపతులు మృతి - Deputy Sarpanch couple died in Khammam district
తెలంగాణ ఖమ్మం జిల్లాలో రెండ్రోజుల క్రితం ఆత్మహత్యాయత్నం చేసిన ఉపసర్పంచ్ దంపతులు మృతి చెందారు. రెండు రోజులుగా చికిత్స పొందుతూ మరణించారు. మృతదేహాలను ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రి మార్చురికి తరలించారు.
![తెలంగాణ: ఆత్మహత్యాయత్నం చేసిన ఉపసర్పంచ్ దంపతులు మృతి deputy sarpanch couple died at khammam hospital](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10541071-1073-10541071-1612759722579.jpg)
తెలంగాణ ఖమ్మం జిల్లా కొనిజర్ల మండలం బోదియ తండాకు చెందిన బాబురావు బిటెక్ చదివారు. రాజకీయాలతో పాటు వ్యవసాయం చేస్తూ ఊళ్లోనే ఉంటున్నారు. రెండేళ్లుగా పత్తి, మిర్చి పంటలో నష్టం వస్తోంది. అప్పు చేసి పెట్టుబడి పెట్టగా వేధింపులు అధికమయ్యాయని మనస్తాపం చెందారు. ఈనెల 6న ఇంటి వద్ద పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు.
భార్యాభర్త, ఇద్దరు పిల్లల్ని ఖమ్మంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించారు. రెండు రోజులుగా చికిత్స పొందుతున్న బాబురావు, ఆయన భార్య ప్రాణాలు కోల్పోయారు. మృతదేహాలను ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రి మార్చురికి తరలించారు. పిల్లల పరిస్థితి విషమంగా ఉందని బంధువులు కన్నీటి పర్యంతమయ్యారు.
ఇదీ చూడండి:ఎన్నవాడలో సర్పంచి అభ్యర్థి గృహనిర్భందం