ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

రాష్ట్రంలో గిరిజనుల అభివృద్ధి కోసం అనేక పథకాలు: ఉపముఖ్యమంత్రి పుష్ప శ్రీవాణి - tribals welfare news

గిరిజనుల అభివృద్ధి కోసం జగన్ ప్రభుత్వం అనేక పథకాలు అమలు చేస్తోందని గిరిజన సంక్షేమ మంత్రి పుష్ప శ్రీవాణి స్పష్టం చేశారు. ఆదివాసీలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తోన్న అభివృద్ధి కార్యక్రమాలు, పాలసీలపై విజయవాడలో నిర్వహించిన సెమినార్ కు ఆన్​లైన్​లో ఆమె హాజరయ్యారు.

ఉపముఖ్యమంత్రి పుష్ప శ్రీవాణి
ఉపముఖ్యమంత్రి పుష్ప శ్రీవాణి

By

Published : Aug 9, 2021, 4:48 PM IST

ఆదివాసీలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తోన్న అభివృద్ధి కార్యక్రమాలు, పాలసీలపై విజయవాడలో రెండు రోజుల సెమినార్ జరుగుతోంది. రాష్ట్ర గిరిజన సంక్షేమ మంత్రి పుష్ప శ్రీవాణి ఆన్​లైన్ ద్వారా హాజరయ్యారు. గిరిజనుల అభివృద్ధి కోసం జగన్ ప్రభుత్వం అనేక పథకాలు అమలు చేస్తోందని ఈ సందర్భంగా మంత్రి చెప్పారు. గిరిజనుల అభివృద్ధి, సంక్షేమం, ఉన్నతి కోసం ఎల్లవేళలా అండగా ఉంటామని ఆమె హామీ ఇచ్చారు.

ట్రైబల్ పాలసీస్ అండ్ ప్రోగ్రామ్స్ ఇన్ ఇండియా రీజినల్ రిఫ్లెక్షన్స్ ఇన్ ది కాంటెక్స్ట్ ఆఫ్ గ్లోబలైజేషన్ అంశంపై ప్రధానంగా చర్చిస్తున్నామని రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి క్రాంతిలాల్ దండే వివరించారు. ఈ కార్యక్రమంలో చర్చించిన అంశాలపై కేంద్ర గిరిజన మంత్రిత్వ శాఖకు నివేదిక అందిస్తామన్నారు. సెమినార్​లో 86 మంది 66 పరిశోధన వ్యాసాలు పంపించారని.. వాటిని పూర్తి స్థాయిలో పరిశీలించిన తర్వాత నాలుగు పుస్తకాలుగా ప్రచురించామని చెప్పారు. ప్రస్తుతం గిరిజనులకు అమలు అవుతున్న పాలసీలు, మౌలిక సదుపాయాలపై చర్చించామని.. వారికి మరిన్ని పాలసీలు తెచ్చేందుకు ఈ సమావేశం ద్వారా ప్రణాళిక రూపొందించేలా ప్రయత్నించామని వివరించారు.

ABOUT THE AUTHOR

...view details