అమరావతే రాజధాని..స్పష్టం చేసిన డిప్యూటీ సీఎం - deputy cm basha comments on capital city
రాజధాని అమరావతిలోనే ఉంటుందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అంజాద్‌బాషా తెలిపారు. జగన్ వస్తే రాజధాని మారుస్తారని తెదేపా దుష్ప్రచారం చేసిందని..కానీ ప్రజలు వాటిని నమ్మలేదన్నారు.
![అమరావతే రాజధాని..స్పష్టం చేసిన డిప్యూటీ సీఎం](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4299175-923-4299175-1567253185241.jpg)
అమరావతే రాజధాని: ఉపముఖ్యమంత్రి అంజాద్ బాషా
నవ్యాంధ్ర రాజధాని అమరావతిలోనే ఉంటుందని ఉపముఖ్యమంత్రి అంజాద్ బాషా స్పష్టం చేశారు. కడప జిల్లా రాయచోటిలో మీడియాతో మాట్లాడిన ఆయన... అన్ని ప్రాంతాలను సమదృష్టితో అభివృద్ధి చేస్తామని అన్నారు. జగన్ వస్తే రాజధాని మారుస్తారని తెదేపా నేతలు దుష్ప్రచారం చేశారని.. వాటిని ప్రజలెవరూ నమ్మలేదన్నారు.