ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

నేడు వాయుగుండం...కోస్తాలో వర్షాలు పడే అవకాశం! - బంగాళాఖాతంలో వాయుగుండం

కోస్తాలో వర్షాలు పడే సూచనలు ఉన్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. ఆగ్నేయ బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం వాయుగుండంగా మారే అవకాశం ఉన్నట్లు తెలిపింది.

Depression in bay of bangal
బంగాళఖాతంలో వాయుగుండం

By

Published : May 15, 2020, 7:41 AM IST

ఆగ్నేయ బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం దక్షిణ బంగాళాఖాతం మధ్య ప్రాంతంలో నేడు వాయుగుండంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. రేపటికి అదే ప్రాంతంలో తుపానుగా మారొచ్చని సూచించింది. 17 వరకు వాయువ్య దిశగా ప్రయాణించి, 18, 19 తేదీల్లో ఈశాన్య దిశగా ఉత్తర బంగాళాఖాతం వైపు కదలొచ్చని వివరించింది.

కోస్తాలో వర్షాలు...

మరఠ్వాడ నుంచి ఇంటీరియర్‌ కర్ణాటక వరకు కొనసాగుతున్న ఉపరితల ద్రోణి ప్రభావంతో శుక్ర, శనివారాల్లో కోస్తా, రాయలసీమల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది. రాయలసీమలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 40 నుంచి 43డిగ్రీలు నమోదు కావొచ్చని పేర్కొంది.

ఇదీ చదవండి:

వలస వెతలు: నడినెత్తిన మంటలు.. పొట్టలో ఆకలి దప్పులు..

ABOUT THE AUTHOR

...view details