రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఈనెల 25 నుంచి సెప్టెంబరు ఒకటో తేదీ వరకు జరగాల్సిన శాఖాపరమైన పరీక్షలను ఏపీపీఎస్సీ వాయిదా వేసింది. ఇప్పటికే ఈ పరీక్షల నిర్వహణ కోసం విస్తృత ఏర్పాట్లు చేసింది. కొవిడ్ నింబధనలకు అనుగుణంగా నిర్వహణ కోసం సమయత్తమైనా.. కరోనా వ్యాప్తిని, కొత్త కేసుల సంఖ్యను పరిగణనలోకి తీసుకుని నిర్ణయం మార్చుకుంది.
పరీక్షలను తర్వాత నిర్వహిస్తామని ప్రకటించింది. ఈ పరీక్షలకు 1.75 లక్షల మంది దరఖాస్తు చేసినట్లు ఏపీపీఎస్సీ కార్యదర్శి పీఎస్ఆర్ ఆంజనేయులు పేర్కొన్నారు. ఇందులో లక్షా 30 వేల మంది సచివాలయ ఉద్యోగులే ఉన్నట్లు తెలిపారు.