ఆంధ్రప్రదేశ్

andhra pradesh

'వంద శాతం ఖర్చు మాదే.. మా తరఫున రాష్ట్రమే నిర్మిస్తోంది'

By

Published : Aug 9, 2021, 10:40 PM IST

తమ తరఫున రాష్ట్ర ప్రభుత్వమే పోలవరం నిర్మాణం చేపడుతోందని కేంద్రం వెల్లడించింది. 2014 ఏప్రిల్ నుంచి నిర్మాణ ఖర్చును వంద శాతం తామే భరిస్తామని కేంద్రం స్పష్టం చేసింది. ఈ మేరకు పార్లమెంట్​లో తెదేపా ఎంపీ కనకమేడల అడిగిన ప్రశ్నకు జలశక్తి శాఖ లిఖితపూర్వక సమాధానం ఇచ్చింది.

పోలవరం నిర్మాణంపై వివరాలు వెల్లడించిన జలశక్తి శాఖ
పోలవరం నిర్మాణంపై వివరాలు వెల్లడించిన జలశక్తి శాఖ

పోలవరం ప్రాజెక్టు నిర్మాణంపై తెదేపా ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్ అడిగిన ప్రశ్నకు కేంద్ర జలశక్తి శాఖ సహాయమంత్రి ప్రహ్లాద్ సింగ్.. లిఖితపూర్వక జవాబు ఇచ్చారు. ఇప్పటివరకు రూ.11,600 కోట్లు రీయింబర్స్ చేశామన్న జలశక్తి శాఖ... పీపీఏ, సీడబ్ల్యూసీ సిఫారసుతో ఆర్థిక శాఖ ఆ ప్రక్రియ చేస్తున్నట్లు వెల్లడించారు.

రాష్ట్రం చేసిన ఖర్చు బిల్లులు పరిశీలించాక రీయింబర్స్‌ చేస్తామని కేంద్రం స్పష్టం చేశారు. 2014 ఏప్రిల్ నుంచి పోలవరం నిర్మాణ ఖర్చును వంద శాతం తామే భరిస్తామని కేంద్రం స్పష్టం చేశారు. అయితే... తమ తరఫున రాష్ట్రమే పోలవరం నిర్మాణం చేపడుతోందని సమాధానంలో వివరించారు.

ABOUT THE AUTHOR

...view details