గుంటూరులోని విజ్ఞాన్ ఇంజినీరింగ్ కళాశాలలో సీఈఎస్, ఎమర్జింగ్ కోర్సులతో 12 సెక్షన్లు ఉండగా.. కేఎల్‌యూలో 35 ఏర్పాటు చేశారు. ప్రైవేటు వర్సిటీల్లో విట్‌లో 17, ఎస్‌ఆర్‌ఎంలో 14, విశాఖ గీతంలో 22 సెక్షన్లు ఉన్నాయి. స్వయంప్రతిపత్తి కళాశాలలు సైతం 4-5 సెక్షన్లు నిర్వహిస్తున్నాయి. విశాఖలోని ఓ ప్రైవేటు కళాశాలలో ఎన్‌ఆర్‌ఐ కోటా కింద సీఎస్‌ఈలో కొందరు రూ.లక్షల డొనేషన్లు చెల్లించి మరీ ప్రవేశాలు పొందారు. రాష్ట్రంలో ఇప్పటివరకు కన్వీనర్ కోటా కింద 81,597 సీట్లను ప్రకటించగా.. వీటిల్లో 41% సీట్లు సీఎస్‌ఈ, కృతిమేథలాంటి కోర్సుల్లోనే ఉన్నాయి.
పేరు మార్చితే... అంతే సంగతులు
కంప్యూటర్ సైన్సు ఇంజినీరింగ్ పేరుతో కాకుండా ఎమర్జింగ్ కృత్రిమేథ, మెషిన్ లెర్నింగ్‌లాంటి ప్రత్యేక కోర్సుల కోడ్ పెడితే విద్యార్థులు ఆసక్తి చూపడం లేదు. నిరుడు మొదటి విడత కౌన్సెలింగ్‌లో సీఎస్‌ఈ కోడ్‌తో ఉన్నవి 93.95% సీట్లు భర్తీ కాగా... ఎమర్జింగ్ కోర్సుల కోడ్‌తో ఉన్నవి 65% మాత్రమే నిండాయి. కంప్యూటర్ సైన్సులో భాగంగా కొత్త కోర్సులు ఉంటేనే ఎంచుకుంటున్నారు. గతేడాది కన్వీనర్ కోటాలో 99,282 సీట్లు ఉండగా 75,140 నిండాయి. సీఈఎస్‌లో మాత్రం 95శాతంపైగా సీట్లు భర్తీ అయ్యాయి. ఈ ఏడాది ఎమర్జింగ్ కోర్సులతో కలిపి కంప్యూటర్ సైన్సులో కన్వీనర్ కోటా 33,183 సీట్లుండగా.. వీటిలో సీఎస్‌ఈ కోడ్‌తో లేనివి కేవలం 3,452 మాత్రమే ఉన్నాయి.