ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Punch Prabhakar: పంచ్ ప్రభాకర్‌పై దిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు కేసు నమోదు - వైకాపా ఎన్ఆర్ఐ సభ్యుడు పంచ్ ప్రభాకర్‌ తాజా సమాచారం

వైకాపా ఎన్ఆర్ఐ సభ్యుడు పంచ్ ప్రభాకర్‌పై దిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఎంపీ రఘురామ ఫిర్యాదు మేరకు ఈ కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు.

Punch Prabhakar
పంచ్ ప్రభాకర్‌

By

Published : Aug 17, 2021, 4:42 PM IST

వైకాపా ఎన్ఆర్ఐ సభ్యుడు పంచ్ ప్రభాకర్‌పై కేసు నమోదు చేశారు. ఎంపీ రఘురామ ఫిర్యాదు మేరకు ఈ కేసు నమోదు చేసినట్లు దిల్లీ పోలీసులు తెలిపారు. ఉపరాష్ట్రపతి, లోక్‌సభ స్పీకర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ పోస్టులు పెట్టారనే ఆరోపణపై కేసులు నమోదు చేసినట్లు వెల్లడించారు. అలాగే రఘురామకృష్ణరాజు సహా పలువురు ప్రముఖులపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ.. యూట్యూబ్‌లో వీడియోలు పెట్టిన వ్యవహారంలో కేసు నమోదు చేసినట్లు తెలిపారు. స్థానిక కోర్టు అనుమతితో ఐపీసీ 504, 506 సెక్షన్ల కింద కేసులు నమోదు అయ్యాయని అన్నారు.

యూట్యూబ్ సంస్థకు కూడా నోటీసులు జారీ చేసినట్లు దిల్లీ పోలీసులు చెప్పారు. పంచ్ ప్రభాకర్ వీడియోల పూర్తి సమాచారం అందించాలని ఆ సంస్థను ఆదేశించినట్లు తెలిపారు. అలాగే పంచ్ ప్రభాకర్‌పై కేసు విచారణ కొనసాగుతుందని వెల్లడించారు.

ఇదీ చదవండీ.. POLAVARAM: పోలవరం నిర్వాసిత గ్రామాల్లో ప్రాజెక్టు అథారిటీ బృందం పర్యటన

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details