వైకాపా గుర్తింపు రద్దు చేయాలంటూ దాఖలైన పిటిషన్ పై విచారణను దిల్లీ హైకోర్టు వాయిదా వేసింది. అన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దాఖలు చేసిన పిటిషన్ ను విచారించిన దిల్లీ హైకోర్టు.. కేంద్ర ఎన్నికల సంఘం, వైకాపా తరపు న్యాయవాదులు కౌంటర్ దాఖలు చేయడానికి సమయం కోరగా.. అందుకు అనుమతిచ్చింది. కౌంటర్ దాఖలుకు నాలుగు వారాల గడువు, కౌంటర్ పై రీజాయిండర్ దాఖలుకు పిటిషనర్ కు రెండు వారాల సమయం ఇచ్చింది. తదుపరి విచారణ నవంబర్ 4 న జరుగుతుందని అన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మహబూబాబాషా తెలిపారు.
వైకాపా గుర్తింపు రద్దుపై విచారణ...నవంబర్ 4కు వాయిదా - Election Commission of India
వైకాపా గుర్తింపు రద్దు చేయాలంటూ దాఖలైన పిటిషన్ పై విచారణను దిల్లీ హైకోర్టు వాయిదా వేసింది. తదుపరి విచారణ నవంబర్ 4 న జరుగుతుందని అన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మహబూబాబాషా తెలిపారు.

Anna YSR Congress Party
ఇదీ చదవండి