పదేళ్లకుపైగా అద్దె, లీజు భవనాలలో కొనసాగుతున్న డిగ్రీ కళాశాలలు ఈఏడాది ఆన్‌లైన్ ప్రవేశాలు నిర్వహించుకునేందుకు అనుమతిస్తూ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సతీష్‌చంద్ర ఉత్తర్వులు ఇచ్చారు. ఏడాదిలోపు శాశ్వత భవనంలోకి మారతామనే షరతుతో యాజమాన్యాల నుంచి లేఖ తీసుకోవాలన్నారు. అద్దె భవనాల్లో కొనసాగుతున్న కళాశాలలకు ప్రవేశాలు నిలిపేస్తామని గత కొన్నేళ్లుగా ప్రకటనలు చేయడం, తర్వాత ఏదో ఒక షరతు పెట్టి అనుమతులివ్వడం పరిపాటిగా మారింది. రాష్ట్రంలో 754 కళాశాలలు అద్దె భవనాల్లో ఉండగా.. వీటిల్లో 543 కళాశాలలు 10ఏళ్లకుపైబడి ఈ భవనాల్లోనే కొనసాగుతున్నాయి.
శిథిల భవనాలు, ప్రహరీల కూల్చివేతకు ఆదేశాలు