'సాయంత్రంలోగా నామినేషన్లు స్వీకరించకుంటే.. ఎన్నికలు రద్దు చేయండి' - స్థానిక ఎన్నికలపై తెదేపా ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి
సాక్షాత్తు మంత్రులు, ఎమ్మెల్యేలే నామినేషన్లు అడ్డుకొనేలా దౌర్జన్యాలు సాగిస్తున్నారని తెదేపా ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి ధ్వజమెత్తారు. పుంగనూరు, ద్వారకా తిరుమల, రేణిగుంట, చంద్రగిరి, జీడీ నెల్లూరులో వైకాపా నేతలు బెదిరింపులకు పాల్పడ్డారని ఆడియో, వీడియో సాక్ష్యాలు ప్రదర్శించారు. ఈసీ, పోలీసులు నిద్రపోతున్నారా అని ప్రశ్నించారు. సాయంత్రంలోగా తమ అభ్యర్థుల నామినేషన్లన్నీ స్వీకరించకుంటే ఎన్నికలు రద్దు కోసం హైకోర్టును ఆశ్రయిస్తామని హెచ్చరించారు.
స్థానిక ఎన్నికలపై తెదేపా ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి వ్యాఖ్య